లండన్ సట్టన్ ప్రాంతంలో నివసిస్తున్న ఉభయ రాష్ట్రాల ప్రవాస తెలుగు వారిచే స్థాపించబడిన స్వచ్ఛంద సేవా సంస్థ. తెలుగు సాంస్కృతిక వికాసం మరియు పరస్పర సహకారం టాస్ యొక్క ప్రధాన లక్ష్యాలు. వారసత్వంగా వస్తున్న తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పట్ల యువతరానికి అవగాహన పెంచటం, మన తెలుగు పండగల్ని ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవడం, మరియు పరస్పర సహకారం ద్వారా సట్టన్ తెలుగు ప్రజల్లో ఐకమత్యం, ఆరోగ్యం, సంతోషం కోసం శ్రమించడమే టాస్ యొక్క ప్రధాన సంకల్పం.